లక్ష దీవులకు పర్యాటకుల తాకిడి క్రమ క్రమంగా పెరుగుతోంది. మాల్దీవుల వివాదం తర్వాత దేశ వ్యాప్తంగా పర్యాటకుల చూపు అరేబియా సముద్రంలోని ఈ ద్వీప సముదాయంపై పడింది. అయితే ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మరింత మంది పర్యాటకులు వస్తారని లక్ష ద్వీప్‌లో విహార యాత్రకు వచ్చిన వారు చెబుతున్నారు. మోదీ టూర్ తర్వాత టూరిస్టులు అంతా లక్ష దీవుల వైపే వెళ్తున్నారు.