దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గర్భిణి బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో 11 మంది దోషులను గుజరాజ్ ప్రభుత్వం 2022లో ముందస్తుగా విడుదల చేసింది. ఈ నేపధ్యంలో బాల్సిస్ బానో సుప్రీం కోర్టుకు వెల్లడంతో మళ్లీ వారిని జైలుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో బానో వెనుక ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషించారు. సీనియర్ జర్నలిస్టు రేవతిలాల్, కన్యూనిస్టు నేత సుభాషిణి అలీ, ప్రొఫెసర్ రూప్ దేఖావర్మలు బానో తరపున పిటిషన్లు వేసి అలుపెరగని పోరాటం చేశారు. చివరకి నిందితులను మళ్లీ జైలుకు పంపారు. నరహంతకులు బిల్కిస్ బానో కళ్ల ముందే ఏడుగురు కుటుంబసభ్యులను కీరాతకంగా హత్యచేశారు.