గుజరాత్ పై మరోసారి పెట్టుబడుల వర్షం కురిపించారు ప్రముఖ ప్రాశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మెన్ గౌతమ్ అదానీ. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు గౌతమ్ అదానీ. ప్రధానీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అదానీ కొనియాడారు. వచ్చే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. 2025 నాటికి రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల్లో రూ. 55 వేల కోట్లు ఖర్చుచేస్తామన్నారు. గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ భారతదేశ భవిష్యత్ గురించి ఆలోచించడమే కాకుండా , దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు గౌతమ్ అదానీ.