కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.తండ్రి ఆస్తిలో కుమారులతో పాటు కుమార్తెలకు కూడా సమాన హక్కు ఉంటుందని, కుమార్తెలు మరణించినా వారి పిల్లలకు సైతం ఆస్తి హక్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తండ్రి ఆస్తిలో హక్కు కుమారుడితో పాటు కుమార్తెకు పుట్టుకతోనే వర్తిస్తుంది. కుమారుడు చనిపోయిన తర్వాత అతని వారసులకు ఆస్తి హక్కు ఏ విధంగా వర్తిస్తుందో అదే విధంగా కుమార్తె పిల్లలకు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగా సమానత్వ సూత్రాలను న్యాయస్థానాలు కాపాడుతూ, లింగ వివక్షకు తావులేకుండా చూడాలని కోర్టు సూచించింది. తమ తోబుట్టువులు చనిపోయారని, వారికి గానీ, వారి సంబంధీకులకు గానీ ఆస్తిలో భాగమెందుకు ఇవ్వాలంటూ చెన్నబసప్ప హోసమఠ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ సచిన్ శంకర్ మగదం ఆ పిటిషన్ ను తోసిపుచ్చారు. తండ్రి సంపాదించిన ఆస్తిలో కుమారుడి పిల్లలకు ఏ విధంగా హక్కు ఉంటుందో అదే విధంగా కుమార్తె పిల్లలకు ఉంటుందని జస్టిస్ సచిన స్పష్టం చేశారు.