తెలంగాణలో కొత్త విద్యుత్ విధానం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత పాలకులు విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్అందించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.విద్యుత్‌శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గృహజ్యోతి పథకం అర్హులకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ విధానంపై నిపుణులతో విస్తృతంగా చర్చిస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.