కరీంనగర్: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను సమస్యలను ఢిల్లీలో కేంద్రం రైల్వే శాఖకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, కేంద్రం రైల్వే మంత్రిని అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకొని వెళ్లగా సానుకూలంగా మంత్రి స్పందించి కరీంనగర్ జిల్లా వారానికి నాలుగు సార్లు తిరుమలకు రైల్వే సౌకర్యాన్ని కేంద్ర రైల్వే మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీనితోపాటు పెద్దపెల్లి నిజామాబాద్ రైల్వే లైను డ్రైనేజీ వ్యవస్థను సరిగా లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను తమ దృష్టికి తీసుకొని వెళ్లి అవసరమైన చోట రోడ్డు అండర్ బ్రిడ్జి డ్రైనేజీలను అనుమతించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటా ఉన్నామని ఆదేశాలను జారీ చేశారు. దీనికి కృషి చేసిన ఎంపి బండి సంజయ్ కి కరీంనగర్ పెద్దపల్లి జిల్లా వాసులు అభినందనలు తెలిపినారు