బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. కేసులకు తాము భయపడబోమన్నారు. బీఆర్ఎస్కు పటిష్ఠమైన లీగల్ సెల్ ఉందని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకొని పోరాడాలని సూచించారు కేటీఆర్.