సంచలనాలు నమోదు చేస్తున్న నాసా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ఆర్టెమిస్ -3 ప్రయోగాన్ని 2025 నుంచి 2026కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు నాసా చీఫ్ బిల్ నెల్సన్. సాంకేతిక సమస్యలు, సవాళ్ల కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు నెల్సన్. 2022లో మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని నాసా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ యేడాది జరగాల్సిన ఆర్టెమిస్ -2ను వచ్చే సంవత్సరానికి, 2025లో జరగాల్సిన ఆర్టెమిస్-3ని 2026కి వాయిదా వేస్తున్నట్టు నాసా ప్రకటించింది.